అనంతగిరి, జులై 30 : భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరమని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య, సర్పంచ్ నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని చనుపల్లిలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి మాట్లాడారు. చెట్లతో పర్యావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసి నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.