బుధవారం 27 మే 2020
Cinema - Apr 30, 2020 , 13:07:53

నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న రిషీ క‌పూర్ ట్వీట్స్ ఇవే..!

నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న రిషీ క‌పూర్ ట్వీట్స్ ఇవే..!

సోష‌ల్ మీడియా ఫైర్ బ్రాండ్ రిషీ క‌పూర్ ఎప్పుడు సంచ‌ల‌న ట్వీట్స్ చేస్తుంటారు. అందులో కొన్ని ట్వీట్స్ కాంట్ర‌వ‌ర్సీ అవ‌తుండ‌గా, మ‌రి కొన్ని ట్వీట్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న‌కి సోష‌ల్ మీడియాలో 3.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, అందులో కొంద‌రు ఆయ‌న‌ని ఛాక్లెట్ భాయ్ అని, చింటు అని ముద్దుగా పిలుచుకుంటారు.

మార్చిలో రిషీ క‌పూర్ చేసిన ట్వీట్‌కి 16000 లైక్స్ వ‌చ్చాయి. అందులో ఆయ‌న  నా దేశం గురించి లేదా నా జీవనశైలి గురించి ఎవరైనా చెత్త‌ జోకులు వేస్తే డిలీట్ చేస్తా అని హెచ్చ‌రించారు.  ఈ స‌మ‌యంలో తాజా ప‌రిస్థితుల‌ని అధిగ‌మించ‌డానికి  లాక్‌డౌన్ ముఖ్య‌మైన‌దని ట్వీట్ చేశారు.

2016లో ఫ్యాష‌న్ దుస్తుల‌కి సంబంధించి రిషీ క‌పూర్ చేసిన ట్వీట్ నెటిజ‌న్స్‌ని రంజింపజేసిది. జారా వ‌ద్ద అత‌ను చిల్లులు ప‌డ్డ టీ ష‌ర్ట్‌, ప్యాంట్‌ల‌ని షేర్ చేస్తూ.. రెండు కొంటే ఒక అడుక్కు తినే బొచ్చె ఫ్రీ అని కామెంట్ పెట్టారు. దీనికి ఫిదా అయిన నెటిజ‌న్స్ ఆ పోస్ట్‌కి  6000 లైకులు కొట్టారు

అలానే 2019లో న్యూయార్క్‌లోని కాస్ట్ లీ షూస్‌ని చూసి సెటైర్ వేశారు. షూస్ బంగారంతో చేసిన‌, వెండితో చేసిన న‌డిచేది కాళ్ళ‌తోనే క‌దా అని పంచ్ ఇచ్చారు. ఇక సినిమాలు మానేయ్య‌మ‌ని బెదిరింపులు వ‌స్తే నాకు మిగిలింది ఛాట్ బండార్ షాప్ అని 2015లో ట్వీట్ చేశారు. ఇలా ఎన్నొ త‌న‌దైన శైలిలో ట్వీట్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని కూడా ఎంత‌గానో అల‌రించారు రిషీ


logo