ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు.
- భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలించే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ విక్రమ్ సింగ్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై గన్రెడ్డి రమణారెడ్డి ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

