శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 08, 2021 , 00:01:48

మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి

మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి

లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్టపై ఏర్పాటు చేసిన నూతన ధర్మకర్తల మండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించామని, త్వరలోనే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వస్తారని చెప్పారు. దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ముద్దసాని కిరణ్‌రెడ్డిని ఆయన సన్మానించారు. పాలక మండలి సభ్యుల సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. - వలిగొండ, ఫిబ్రవరి 7

వలిగొండ, ఫిబ్రవరి 7: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి   కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపురం గ్రామపరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండగుట్టపై ఏర్పాటు చేసిన నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో యాదాద్రి దేవస్థానం తర్వాత అత్యంత సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమన్నారు. మత్స్యాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించామని, మత్స్యగిరి  లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సీఎంను  ఆహ్వానించామన్నారు.  టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహణ అధ్య క్షుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను స్వామి దర్శనం కోసం తీసుకొస్తానని తెలిపారు. దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ముద్దసాని కిరణ్‌రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. 

మత్స్యాద్రి అభివృద్ధికి కృషి

అందరి సహకారంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి  దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌ ముద్దసాని కిరణ్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, దాతల సహకారం, దేవస్థాన పాలకమండలి సభ్యుల సహాయంతో  అభివృద్ధి చేస్తానన్నారు.  అంతకుముందు నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఎక్కలదేవి శ్రీనివాస్‌, పోలేపల్లి బాలకృష్ణ, యార శ్రీశైలం, పోలేపాక భిక్షపతి, కాచమల్ల శేఖర్‌, కొంపల్లి సత్తయ్య, జక్కల మత్స్యగిరి, బరిశెట్టి మహేశ్‌, బండారి వెంకటనర్సింహ, పాశం మహేందర్‌, సుంకి శమంత, ఎలిమినేటి యాదగిరి, కట్ట జ్యోతిలక్ష్మి, దేవస్థానం అర్చకుడు ప్రతాపురం శ్రీనివాసాచార్యులుతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా పర్యవేక్షకుడు రఘునాథం   ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులు ముద్దసాని కిరణ్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కొత్త నర్సింహ, పీఏసీఎస్‌ చైర్మన్లు సుర్కంటి వెంకట్‌రెడ్డి, చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి, రైతు బంధుసమితి కన్వీనర్‌ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, చిట్టెడి జనార్దన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్‌, తుమ్మల వెంకట్‌రెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు డేగల పాండరి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo