Akshay Kumar | క్రేజీ టాక్.. బిగ్‌బీ మనవడితో స్టార్ హీరో మేనకోడలు రొమాన్స్..!
Akshay Kumar | సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల నటవారసులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కొందరైతే.. సక్సెస్ కోసం ప్రయత్నించే వారు, సక్సెస్‌లో వెళ్తున్న వారు మరొకొందరు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ సెలబ్రిటీ మేనకోడలు సిమర్ భటారియా (Simar Bhataia) ఎంట్రీ ఇస్తోంది.
Akshay Kumar | ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరిగేదే. ఈ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమలు కూడా వస్తాయి. అయితే స్టార్ సెలబ్రిటీల నటవారసులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కొందరైతే.. సక్సెస్ కోసం ప్రయత్నించే వారు, సక్సెస్‌లో వెళ్తున్న వారు మరికొందరు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ సెలబ్రిటీ మేనకోడలు సిమర్ భటారియా (Simar Bhataia) ఎంట్రీ ఇస్తోంది.
ఇంతకీ ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరనే కదా మీ డౌటు. బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar). లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ The Archiesతో ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. Ikkis టైటిల్‌తో రాబోతున్న అగస్త్య నందా కొత్త సినిమాలో అక్షయ్ కుమార్ మేనకోడలు సిమర్ భటారియా రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందని బీటౌన్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు సమాచారం.
అక్షయ్ కుమార్ ఫ్యామిలీ నుంచి యాక్టర్‌గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయిన సిమర్ భటారియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు, మూవీ లవర్స్. మరి తొలి సినిమాతో ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేయబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

