Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Pakistan Astronaut | అంతరిక్ష పరిశోధనల్లో పాకిస్థాన్ చారిత్రక మైలురాయిని అందుకుంది. తొలిసారిగా ఒక వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది.
Pakistan Astronaut | అంతరిక్ష పరిశోధనల్లో పాకిస్థాన్ చారిత్రక మైలురాయిని అందుకుంది. తొలిసారిగా ఒక వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది. బుధవారం ఉదయం 5.48 గంటలకు చైనా జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. అందులో పాక్ వైమానిక దళానికి చెందిన మహమ్మద్ జీషాన్ అలీ ఇద్దరు చైనా వ్యోమగాములతో కలిసి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పాకిస్థాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కల సాకారమైంది.
ఈ మిషన్‌లో జీషాన్ అలీతో పాటు చైనా వ్యోమగాములు టాంగ్ హాంగ్బో, వు యి ఉన్నారు. వీరు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సుమారు వారం రోజుల పాటు గడపనున్నారు. అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో శాస్త్రీయ ప్రయోగాలు చేయడంతో పాటు విద్యార్థులు, ప్రజలకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే అంతరిక్ష కేంద్రంలో నివసిస్తూ పరిశోధనలు చేయడం ఈ మిషన్ ప్రత్యేకత.
పాకిస్థాన్ అంతరిక్ష ప్రయాణం గతంలో ఉప కక్ష్య పర్యాటక యాత్రతో ప్రారంభమైంది. 2023లో నమీరా సలీమ్ వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష పర్యాటక విమానంలో ప్రయాణించి అంతరిక్ష అంచుల వరకు వెళ్లిన తొలి పాకిస్థానీగా గుర్తింపు పొందారు. అయితే ఆ ప్రయాణం కొద్ది నిమిషాలకే ముగిసి భూమికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం జీషాన్ అలీ చేపట్టిన ప్రయాణం అందుకు భిన్నమైనది. ఆయన అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాలు నిర్వహించనున్నారు. దీంతో అంతరిక్ష కేంద్రానికి వెళ్లి పనిచేసే వ్యోమగాములను పంపిన దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది.

Pak Astronaut Muhammad Zeesan Ali
చైనా, పాకిస్థాన్ మధ్య గత దశాబ్ద కాలంగా ఉపగ్రహ సాంకేతికత, కమ్యూనికేషన్లు, భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ వంటి రంగాల్లో సహకారం విస్తరిస్తోంది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం ఈ భాగస్వామ్యంలో మరో కీలక అడుగుగా మారింది. ఈ క్రమంలో నిర్వహించిన అంతరిక్ష యాత్ర కోసం పాకిస్థాన్‌లో సుమారు 200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు జీషాన్ అలీ, ఖుర్రమ్ దావూద్ అనే ఇద్దరిని ఎంపిక చేసి చైనాలో శిక్షణకు పంపారు. 2025 నుంచి వీరికి అంతరిక్ష నౌక నిర్వహణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, అంతరిక్షంలో జీవించే విధానం, ప్రయోగాల నిర్వహణ, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇచ్చారు. ప్రయాణానికి ఒక రోజు ముందు జీషాన్ అలీని తుది వ్యోమగామిగా ప్రకటించారు.
నాలుగు దశాబ్దాల కిందే భారత్ చరిత్ర !
భారత్ 1984 ఏప్రిల్‌లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మను సోవియట్ సోయుజ్ టీ-11 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. ఆయన సల్యూట్-7 అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజుల పాటు గడిపారు. దక్షిణాసియాలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ కూడా తన వ్యోమగామిని కక్ష్యలోని అంతరిక్ష కేంద్రానికి పంపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ‘ఈథా’పై నెట్టింట విమర్శలు.. డైలాగ్ డెలివరీపై నెటిజన్ల అసంతృప్తి!
Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

