హైదరాబాద్ : బ్లాకులో(Block tickets) ఐపీఎల్ మ్యాచ్( IPL match )టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రమణ(బెంగళూరు), శామ్యూల్(హైదరాబాద్) వద్ద నుంచి 101 ఐపీఎల్ టికెట్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు వెయ్యికి పైగా వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా టికెట్లు విక్రయిస్తున్నారు. హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్ టికెట్లు అధిక ధరలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.