చండీగఢ్: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి పంజాబ్లోని ప్రభుత్వ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దీనిని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈడీ సోదాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈడీకి చెందిన ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. (AAP workers vandalise ED vehicles) తిరుపతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనుబంధ కంపెనీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, మొహాలీ, చండీగఢ్, పంచకులా, లుధియానాలలోని 26 ప్రాంగణాలలో ఈడీ రైడ్స్ చేస్తున్నది. ఇందులో భాగంగా గురువారం గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (జీఎంఏడీఏ) కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
కాగా, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలను వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో వందలాది మంది ఆప్ కార్యకర్తలు జీఎంఏడీఏ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బారికేడ్లను తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందితో ఆప్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈడీకి చెందిన ఒక వాహనం అద్దాన్ని ధ్వంసం చేశారు.
మరోవైపు పంజాబ్ ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ సాధనంగా బీజేపీ వాడుకుంటోందని అధికార ఆప్ ఆరోపించింది. జీఎంఏడీఏ పనితీరుకు ఆటంకం కలిగించి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈడీ చర్యల లక్ష్యమని ఆప్ నేతలు విమర్శించారు. ‘రాజకీయ మార్గాల ద్వారా సంక్షేమ పథకాలను ఆపడంలో బీజేపీ విఫలమవుతోంది. అందుకే ఇప్పుడు పరిపాలనాపరమైన ఒత్తిడిని, అడ్డంకులను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎత్తుగడలను పంజాబ్ ప్రజలు సఫలం కానివ్వరు’ అని ఆప్ పేర్కొంది.
అలాగే ఈడీ చర్యను పంజాబ్ ప్రభుత్వం చట్టపరంగా సవాల్ చేసింది. ఈడీ సోదాలు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు జరిగిన ప్రదేశాలను సందర్శించి పరిస్థితిపై నివేదిక సమర్పించేందుకు ఒక వారెంట్ అధికారిని హైకోర్టు నియమించింది. ఆ ప్రాంగణాన్ని ఎప్పుడైనా తనిఖీ చేసే వెసులుబాటును ఆ అధికారికి కల్పించింది.
👉 “The thieves are making the noise…”
👉 I strongly condemn AAP workers, led by Sherry Kalsi, for allegedly damaging an @dir_ed vehicle at the GMADA office in Mohali.
👉 This, it is alleged, is an attempt to protect Guru Dokhi @BhagwantMann , @AroraAmanSunam , @ArvindKejriwal… pic.twitter.com/OokYZCX839
— Bikram Singh Majithia (@bsmajithia) September 24, 2026