Padi Kaushik Reddy | కేసీఆర్ మీద కామెంట్ చేయడానికి నువ్వెవరు.. సీపీ సజ్జనార్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
Padi Kaushik Reddy | నిన్న ప్రెస్మీట్లో కేసీఆర్ పాటలు పెట్టుకుంటే మీ మీద కేసులు పెడ్తమంటడు.. అసలేం నువ్వెవనియ్యా చెప్పడానికి.. కేసీఆర్ మీద కామెంట్ చేయడానికి నువ్వెవరని ప్రశ్నించారు.
Padi Kaushik Reddy | ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ పాటలు పెట్టొద్దంటూ పోలీసులు వాహనాలు ఆపేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు అంతటితో ఆగకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ట్యాంక్ బండ్ వద్ద కేసీఆర్ పాటలు పెడితే స్పీకర్లు ఎత్తుకెళ్లిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ ప్రెస్మీట్లో వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేస్తున్నామంటూ కామెంట్స్ చేయడంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీ సజ్జనార్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. అసలు వీళ్లు ఆఫీసర్లా.. రాజకీయ నాయకులా మాకు అర్థమైతలేదు. నిన్న ప్రెస్మీట్లో కేసీఆర్ పాటలు పెట్టుకుంటే మీ మీద కేసులు పెడ్తమంటడు.. అసలేం నువ్వెవనియ్యా చెప్పడానికి.. కేసీఆర్ మీద కామెంట్ చేయడానికి నువ్వెవరని ప్రశ్నించారు.
కేసీఆర్ మీద పాటలు పెడితే మీ మీద కేసులు పెడ్తం.. మిమ్మల్ని లాఠీలతో కొడ్తమని చెప్పడానికి నువ్వెవరివి.. సజ్జనార్ రేపు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్లమో.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా ఎవరు ఏం అన్నం తినాలో.. ఏం వండుకోవాలో ఏం బ్రేక్ ఫాస్ట్ చేయాలో.. లంచ్ ఏం తినాలో.. డిన్నర్ ఏం చేయాలో అది కూడా రిలీజ్ చేయండి.. అందరూ అదే తింటరని ఎద్దేవా చేశారు. ఆఫీసర్లకు కూడా మళ్లీ చెప్తున్నా.. మీరు ఎక్స్‌ట్రాలు చేయకండి.. సజ్జనార్.. మీరు ఈ రెండు సంవత్సరాల్లో నేను రిటైరైపోతా అనుకుంటున్నారేమో.. సప్త సముద్రాలు దాటి ఉన్నా రేపు మీ అందరి తాట తీస్తాం బిడ్డా అని హెచ్చరించారు. ఎన్ని రోజులు మీ పోలీసోళ్లను అడ్డం పెట్టి బతుకుతరు.. నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చా.. ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాటలు పెడితే కేసులు పెడతామని సజ్జనార్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు
అసలు వీళ్లు అధికారులా, రాజకీయ నాయకులా?
ఎవరు ఏం చేయాలో చెప్పడానికి సజ్జనార్ ఎవరు?
అధికారులు ఎక్కువ చేయకండి
రెండేళ్లలో రిటైర్డ్ అవుతామని అనుకుంటున్నారేమో.. సప్తసముద్రాలు దాటినా వదిలిపెట్టం
– పాడి… https://t.co/wUucZrNrCA pic.twitter.com/5lMT4Izb3s
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

