Loksabha Elections 2024 | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్ : అమిత్ షా
Loksabha Polls 2024 : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన అనంతరం బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
Loksabha Polls 2024 : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన అనంతరం బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ మళ్లీ అదే సంతుష్టీకరణ, బుజ్జగింపు రాజకీయాలను పునరావృతం చేసిందని చెప్పారు. దేశాన్ని విభజించే పర్సనల్ లాను ముందుకు తీసుకెళతామని కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేసిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా పేర్కొన్నారు.
పేదల అభ్యున్నతి, దేశ పురోగతికి కట్టుబడి ఉండే పార్టీని ఆదరించాలని తాను ఓటర్లను అభ్యర్ధిస్తున్నానని ఆయన చెప్పారు. దేశాన్ని షరియా ప్రకారం ముందుకు తీసుకువెళతారా అని రాహుల్ గాంధీని అమిత్ షా ప్రశ్నించారు. మన రాజ్యాంగం లౌకిక పునాదులపై ఏర్పడిందని, మత ప్రాతిపదికన మన చట్టాలు రూపొందవని స్పష్టం చేశారు.
ఉమ్మడి పౌర స్మృతి తీసుకువస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. తాము ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి యూసీసీని చేపట్టామని, దీన్ని తాము ముందుకు తీసుకెళతామని షా తేల్చిచెప్పారు. దేశాన్ని విభజించే పర్సనల్ లా గురించి రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో వ్యక్తిగత చట్టాలను అమలు చేయలేమని, నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపడతారని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Nikhil Kumaraswamy | ఓటర్లకు రూ. 10,000 కూపన్లు పంచిన కాంగ్రెస్ : జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

