Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భక్తులు.. 114 రోజుల్లోనే 47 లక్షల మంది
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం (Rainy Season) కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
Char Dham Yatra : ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం (Rainy Season) కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 4,68,556 అధికం కావడం విశేషం. ఈ ఏడాది యాత్ర సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా సాగుతోంది.
భక్తుల భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టంచేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ యాత్ర సజావుగా సాగేలా అన్ని సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నియంత్రణ గది నుంచి ఆయన స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
వాతావరణం అనుకూలించనప్పుడు ప్రభుత్వం యాత్రికుల కదలికలను నియంత్రిస్తూ, యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నది. సోమవారం వాతావరణం అనుకూలించకపోయినా 15,376 మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రానికి అత్యధికంగా 16,12,112 మంది భక్తులు తరలివచ్చారు. ఆ తర్వాత కేదార్‌నాథ్‌ను 14,50,116 మంది, గంగోత్రిని 7,37,629 మంది, యమునోత్రిని 6,62,347 మంది దర్శించుకున్నారు. వీరే కాకుండా హేమకుండ్ సాహిబ్‌ను 2,40,499 మంది భక్తులు సందర్శించారు.
గత ఏడాదితో పోలిస్తే ఒక్క బద్రీనాథ్‌లోనే 3.5 లక్షల మందికిపైగా అదనపు యాత్రికులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలను ఏప్రిల్ 19న తెరవడంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. హిందూమతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను కలిపి ఛోటా చార్‌ధామ్‌గా పిలుస్తారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేసేందుకు ఈ యాత్రా సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

