నాంపల్లి, ఆగస్టు 12 : నాంపల్లి మండలంలోని తుంగపహాడ్ గ్రామానికి చెందిన నేతల్ల సత్తయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కడారి శ్రీశైలం యాదవ్ సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట పచ్చిపాల ఆంజనేయులు, మేకల దేవేందర్, నేతల్ల నర్సింహా, నర్సింహా, యాదయ్య, నగేష్, శ్రీకాంత్, కసిరెడ్డి మహేష్, గుండాల శివ ఉన్నారు.