జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్పల్లి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారిణి దరోజు పద్మా అవినీతికి ( Bribe ) పాల్పడుతూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మండల కేంద్రంలో ఉన్న 21 అంగన్వాడీల ( Anganwadi Centres ) తనిఖీ సందర్భంగా వ్యతిరేకంగా నివేదికలు తయారు చేయవద్దని కోరినందుకు సీడీపీవో లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు వివరించారు.
ఒక్కో అంగన్వాడీ కేంద్రం నెలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు కలిపి 63 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడం తో శనివారం రూ. 63 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు.