యుద్ధంలో 4.6 లక్షల మంది రష్యా సైనికుల మృతి!
ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యాకు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 సెప్టెంబరు వరకు 4.6 లక్షల మందికి పైగా సైనికులు మరణించినట్లు రష్యా గణాంక సంస్థ రోస్‌స్టాట్‌కు చెందిన లీకైన పత్రాల విశ్లేషణలో వెల్లడైంది. ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్ ఈ వివరాలను పరిశీలించాయి. వీరిలో వెయ్యిమందికిపైగా సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యాకు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 సెప్టెంబరు వరకు 4.6 లక్షల మందికి పైగా సైనికులు మరణించినట్లు రష్యా గణాంక సంస్థ రోస్‌స్టాట్‌కు చెందిన లీకైన పత్రాల విశ్లేషణలో వెల్లడైంది. ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్ ఈ వివరాలను పరిశీలించాయి. వీరిలో వెయ్యిమందికిపైగా సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం మొదటి ఏడాది సుమారు 20 వేల మరణాలు నమోదయ్యాయి. 2023లో 50 వేలు, 2024లో 1.34 లక్షలు, 2025లో ఏకంగా 2 లక్షల మంది మరణించినట్లు విశ్లేషణ వెల్లడించింది. 2025లో రోజుకు సగటున 548 మంది ప్రాణాలు కోల్పోయారు. 2026లో మరణించిన సైనికుల్లో 20 శాతం మంది 50 ఏళ్లకు పైబడినవారే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

