వృద్ధురాలిపై లైంగిక దాడి నిందితుడి అరెస్ట్
చలికాలం కావడంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దుప్పట్లు పంచుతున్నారంటూ చెప్పడంతో అక్కడకు వచ్చిన వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే..
బంజారాహిల్స్, నవంబర్ 24 : చలికాలం కావడంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దుప్పట్లు పంచుతున్నారంటూ చెప్పడంతో అక్కడకు వచ్చిన వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ పరిధిలోని ఓ బస్తీలో నివాసం ఉంటున్న వృద్ధురాలి(60)కి సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి వేళ దాతలు వచ్చి దుప్పట్లు పంచుతున్నారని తెలిసింది.దీంతో రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో క్యాన్సర్ ఆస్పత్రి ఫుట్‌పాత్ వద్దకు వచ్చిన వృద్ధురాలు దుప్పటి తీసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఉపక్రమిస్తున్న క్రమంలో మూత్ర విసర్జన కోసం సమీపంలో ఖాళీ స్థలంలోకి వెళ్లింది.
అదే ప్రాంతంలో అవారాగా తిరుగుతూ మద్యం సేవించే పాత నేరస్తుడు భరత్ ఒంటరిగా ఉన్న వృద్ధురాలు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లడాన్ని గమనించి అక్కడకు వెళ్లి ఆమెను చంపేస్తానంటూ బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించేందుకు యత్నించగా దాడి చేశాడు.ఈ క్రమంలో ఆమె ఫోన్ కిందపడిపోవడంతో దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భరత్‌ను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

