కష్టాల్లో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్
కోట్లాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో బొగ్గును భద్రపరిచేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో వర్షాకాలంలో బొగ్గు తడుస్తున్నది. ఆ బొగ్గును వి ద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగిస్తే యంత్రా లు మెరాయిస్తున్నాయి. కేటీపీపీలో 1,100 మోగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) మార్గదర్శకాల ప్రకారం ఈ ప్లాంట్‌లో 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన కోల్యార్డ్ ఉన్నది. మరో 50 వేల టన్నుల బొగ్గును స్టాకర్ రిక్లెయిమర్ ఓపెన్ యార్డులో నిల్వచేస్తున్నారు.
- ఓపెన్ ప్లేస్‌లో బొగ్గు నిల్వ
- తడిసిన బొగ్గుతో చూట్, క్రషర్జామ్
- మూడేండ్లలో 58 కోట్ల నష్టం
- కొత్తగా రూ.93 కోట్లతో కోల్ యార్డ్ నిర్మాణానికి ఈఆర్సీ అనుమతి కోరిన జెన్కో
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కోట్లాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో బొగ్గును భద్రపరిచేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో వర్షాకాలంలో బొగ్గు తడుస్తున్నది. ఆ బొగ్గును వి ద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగిస్తే యంత్రా లు మెరాయిస్తున్నాయి. కేటీపీపీలో 1,100 మోగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) మార్గదర్శకాల ప్రకారం ఈ ప్లాంట్‌లో 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన కోల్యార్డ్ ఉన్నది. మరో 50 వేల టన్నుల బొగ్గును స్టాకర్ రిక్లెయిమర్ ఓపెన్ యార్డులో నిల్వచేస్తున్నారు.
మిగిలిన బొగ్గును బహిరంగ ప్రదేశా ల్లో నిల్వ చేయాల్సి వస్తున్నది. దీంతో వర్షాకాలంలో ఆ బొగ్గు తడిసిపోతున్న ది. తడి బొగ్గుతో చూట్జామ్, క్రషర్ జామ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బాయిలర్లకు బొగ్గు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నా యి. విద్యుత్తు ఉత్పత్తి తగ్గడంతోపాటు అదనపు అయిల్ను వినియోగించాల్సి వస్తున్నది. తడి బొగ్గు, అదనపు ఆయి ల్ వినియోగం కారణంగా 2021-24 మధ్య కాలంలో దాదాపు రూ. 58.46 కోట్ల నష్టం వాటిల్లినట్టు నిపుణులు తేల్చారు. ఈ సమస్య పరిషారానికి రూ.93 కోట్లతో కొత్తగా కోల్యార్డ్ను నిర్మించాలని జెన్కో నిర్ణయించింది. భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని కేటీపీపీ స్టేజ్-2 (600 మెగావాట్లు)లో 1.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వ సామర్థ్యంతో ఈ యార్డును నిర్మించనున్నారు. ఈ పనుల కోసం 2026-27లో రూ.15కోట్లు, 2027 -28లో రూ.60కోట్లు, 2028-29 లో రూ.18 కోట్ల చొప్పున ఖర్చు చేసేందుకు జెన్కో అధికారులు ఈఆర్సీ అనుమతి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

