ఐటీ కారిడార్లోట్రాఫిక్ కష్టాలకు చెక్
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం, సుస్థిర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
- సైబరాబాద్ మూవ్స్ పేరిట మూడు రోజుల సదస్సు
- టీ హబ్ వేదికగా 26 నుంచి 28 వరకు నిర్వహణఏర్పాట్లను
- పరిశీలించిన సీపీ రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన
- కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశాలు
సిటీబ్యూరో, నవంబరు 24 (నమస్తే తెలంగాణ) : ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం, సుస్థిర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా జరగనున్న ఈ మూడు రోజుల సదస్సు ఏర్పాట్లను మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ రమేశ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన సంయుక్తంగా పరిశీలించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), ట్రాఫిక్ పోలీసులు, సీఎంసీ అధికారులతో కలిసి వేదిక వద్ద కల్పిస్తున్న సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. పట్టణ రవాణా వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, రహదారి భద్రత, పర్యావరణహిత రవాణా (గ్రీన్ మొబిలిటీ), మెరుగైన అనుసంధానంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా స్మార్ట్ రవాణా పరిషారాలను రూపొందించేందుకు వివిధ రంగాల నిపుణులు, భాగస్వాములు, సామాన్య పౌరులు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

