Avesham | పుష్ప యాక్టర్ అరుదైన మైల్స్టోన్.. ఆవేశం మరో క్రేజీ రికార్డ్
Avesham | పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించిన తాజా చిత్రం ఆవేశం (Avesham) మరోసారి వార్తల్లో నిలిచింది. యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
Avesham | కొంతకాలంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మాలీవుడ్ సినిమాలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయని తెలిసిందే. తాజాగా పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించిన తాజా చిత్రం ఆవేశం (Avesham) మరోసారి వార్తల్లో నిలిచింది. యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రోమాంచం ఫేం జీతూ మాధవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు గ్రాస్ సాధించిన మాలీవుడ్ మూవీగా నిలిచింది. మరోవైపు కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ సాధించి అరుదైన మైల్స్టోన్కు చేరుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. పులిమురుగన్, బాహుబలి 2, లూసిఫర్, కేజీఎఫ్ 2, జైలర్, ఆర్డీఎక్స్, లియో, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ది గోట్‌లైఫ్ సినిమాల తర్వాత ఈ మైల్స్టోన్ చేరుకున్న 12వ సినిమాగా ఆవేశం రికార్డుల్లోకెక్కింది. మొత్తానికి ఫహద్ ఫాసిల్ క్రేజ్‌కు మాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
2024 మొదటి త్రైమాసికంలో మాలీవుడ్ నుంచి ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, The Goat Life సినిమాలు 100 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాయని తెలిసిందే. తాజాగా ఆవేశం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రాన్ని నజ్రియా నజీమ్ నిర్మించడం విశేషం. ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్‌లో నటిస్తున్నాడు. పుష్ప ది రైజ్‌లో ఒకటి తగ్గింది.. అంటూ తనదైన మ్యానరిజంతో అలరించాడు ఫహద్ ఫాసిల్. మరోవైపు తమిళంలో మారీసన్, వెట్టయియాన్ చిత్రాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
ఆవేశం మరో క్రేజీ మైల్స్టోన్..
#Aavesham Breaking into the 50 Crore Kerala Grossers Club❤️🔥🥁
– 8th Malayalam 50cr Movie from Kerala
– 12th 50cr Film from Kerala Overallpic.twitter.com/jI7KWRLEaE— MalayalamReview (@MalayalamReview) April 25, 2024
రూ.100 కోట్ల క్లబ్ దిశగా..
#aavesham TO 50CR CLUB 🔥🔥 Another 50 For FaFa After #Njanprakashan.
100CR POSSIBLE IN THIS TREND🔥#Aavesham #Fafa #FahadhFaasil pic.twitter.com/qMlYjP33tU
— Adwaith (@AdwaithAk188943) April 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

