Health Drinks | సమ్మర్లో బెస్ట్ డీటాక్స్ డ్రింక్స్ ఇవే..!
Health Drinks : మండే వేసవిలో ఉష్ణ తాపాన్ని తగ్గించుకునేందుకు శరీరం పునరుత్తేజమయ్యేందుకు ఎన్నో పానీయాలు తీసుకుంటాం. అయితే డీటాక్స్ పానీయాలు శరీరంలో వ్యర్ధాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేసేందుకు ఉపకరిస్తాయి.
Health Drinks : మండే వేసవిలో ఉష్ణ తాపాన్ని తగ్గించుకునేందుకు శరీరం పునరుత్తేజమయ్యేందుకు ఎన్నో పానీయాలు తీసుకుంటాం. అయితే డీటాక్స్ పానీయాలు శరీరంలో వ్యర్ధాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేసేందుకు ఉపకరిస్తాయి. డీటాక్స్ డ్రింక్స్ మన దాహార్తిని తీర్చడంతో పాటు ఉక్కపోతతో చెమటల కారణంగా కోల్పోయిన పోషకాలు, లవణాలు సహా అత్యవసర పోషకాలను భర్తీ చేస్తాయి. డీటాక్స్ డ్రింక్స్‌ను అధికంగా తీసుకునేవారికి సమ్మర్లో ఈ బెస్ట్ డ్రింక్ మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్ క్రియేటర్ ఏన్షియంట్ డిగిన్ మెరుగైన జీర్ణక్రియ కోసం బీట్రూట్, జింజర్ డీటాక్స్ డ్రింక్ రెసిపీని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. బీట్రూట్, అల్లం, పసుపు, బ్లాక్ పెప్పర్‌తో ఈ డ్రింక్‌ను తయారుచేసుకునే విధానాన్ని వివరిస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ డీటాక్స్ డ్రింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలతో పాటు యాంటీఆక్సిడెంట్స్‌ను కలిగిఉండటంతో శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బ్లాక్ పెప్పర్ వాడటంతో శరీరం పోషకాలను మెరుగ్గా సంగ్రహించే సామర్ధ్యం లభిస్తుంది. ఇక దీంతో పాటు ఆరెంజ్ క్యారెట్ జింజర్ డీటాక్స్, లెమన్, కొత్తిమీర డీటాక్స్ డ్రింక్, తేనె నిమ్మరసం అల్లం టీ, కుకుంబర్ కివీ జ్యూస్ వంటి డీటాక్స్ డ్రింక్స్‌ను తీసుకుంటే వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

