Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇటీవలే గేమ్ ఛేంజర్ కీలక షెడ్యూల్ పూర్తయినట్టు వార్త కూడా బయటకు వచ్చింది. ఈ షెడ్యూల్లో సునీల్, నవీన్ చంద్ర, రాంచరణ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్.
ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారట. కాగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం గేమ్ ఛేంజర్ తాజా షెడ్యూల్ ఏపీలోని రాజమండ్రిలో నేడు షురూ కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్ పలు కారణాల వల్ల వాయిదా పడ్డట్టు సమాచారం. తాజా టాక్ ప్రకారం రాంచరణ్ టీం మొదట హైదరాబాద్‌లో షూట్ చేసిన అనంతరం.. రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్‌లో కథానుగుణంగా రాంచరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు. రాజమండ్రి షెడ్యూల్లో రాంచరణ్ తండ్రి పాత్రపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. సీనియర్ రాంచరణ్‌కు జోడీగా అంజలి కనిపించనుంది.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.