The Family Man S3 | ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు నమోదు చేసింది. స్పై, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించింది. అయితే ఈ సిరీస్ మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయినట్లు అమెజాన్ ప్రైమ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అధిక భాగం నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుపుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలవుతుందని. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను శ్రీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాల్సిందే.
#TFM3W???
us: shoot begins 🎬☺️drop your excitement 👇#TheFamilyManOnPrime@BajpayeeManoj @rajndk @sumank #PriyaMani @sharibhashmi @ashleshaat @VedantSinha0218 pic.twitter.com/D1lxUfxxmK
— prime video IN (@PrimeVideoIN) May 6, 2024