కరీంనగర్ : ఎన్నికల ప్రచారంలో( Parliamentary election) కరీంనగర్(Karimnagar) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లు తిరుగుతూ, అందరిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
ఊరువాడ, చేను, చెలక అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ అందరితో మమేకమవుతూ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో (Campaign) భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. వాకర్లతో మాట్లాడి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.