ప్రజాప్రతినిధుల ఔదార్యం

- కరోనాను ఎదుర్కొనేందుకు సీఎంఆర్ఎఫ్కు వేతనాలు
- ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు సైతం విరాళంగా అందజేత
నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మద్దతు పలుకుతూ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. వైరస్ నియంత్రణకు అవలంబించాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఆర్థికంగా కూడా సర్కారుకు మద్దతు నిచ్చారు. తమ నెల వేతనంతో పాటు ఈ ఏడాది విడుదల కానున్న సీడీపీ నిధులను సైతం సీఎంఆర్ఎఫ్లో జమ చేయడానికి అంగీకరించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దేవరకొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్యలు తమ నెల వేతనం రూ. 2.50 లక్షల సీఎంఆర్ఎఫ్కు అందించారు. ఈ ఏడాది వచ్చేటువంటి అభివృద్ధి నిధులు రూ. 3 కోట్లు సైతం ఇస్తామని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ రెండు నెలల వేతనం ప్రకటించి రూ. 5 కోట్ల నిధులు సీఎంఆర్ఎఫ్కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్‌పై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఆర్థిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే
ఎంపీ బడుగుల లింగయ్య సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సీఎం సహాయనిధికి తమ వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలో సామాన్యులు సైతం ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. కోదాడలోని భారతి విద్యామందిర్ చైర్మన్ కట్టా సత్తిరెడ్డి రూ.1,11,116 చెక్కును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు. స్థానికుడైన ఇమ్మడి రమేశ్ కుటుంబ సభ్యులు పట్టణంలో పారిశుధ్య పనులకు రూ.50వేల విరాళం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అందజేశారు.
తాజావార్తలు
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- ఖనిజ నిధులతో అభివృద్ధి
- ముగిసిన జిల్లా స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్
- బంగారం కొనుగోలుకు ఎస్బీఐ రుణ పరపతి ఇలా..
- వాస్తవాలు గ్రహించండి
- బండి సంజయ్‌కు మతిభ్రమించింది
- మీనం మెరిసెను..!
- స్వచ్ఛత దిశగా పినపాక
- వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి