గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 10:00:48

బ్లాక్‌ మార్కెట్‌పై అధికారుల నజర్‌

బ్లాక్‌ మార్కెట్‌పై అధికారుల నజర్‌

హైదరాబాద్‌ : ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకొనేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రజల్లో పెరుగుతున్న పుకార్ల దృష్ట్యా, నిత్యావసర వస్తువులకు పెరిగిన రద్దీని క్యాష్‌ చేసుకోవాలనే కొందరి వ్యాపారస్తులను పట్టుకొనేందుకు సివిల్‌ సైప్లె అధికారులు పలు బృందాలుగా వీడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. మామూలు వ్యక్తులుగానే కొనుగోళ్లకు వెళ్లారు. 

ఒకవేళ అధిక ధరలకు విక్రయిస్తే అప్పటికప్పుడే వారిపై సివిల్‌ సైప్లె యాక్ట్‌ 1955 కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోనున్నారు. సివిల్‌ సైప్లె అధికారులు స్థానికంగా ఉండే తహసీల్దార్లతో కలిసి తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దుకాణదారులకు అవగాహన కల్పించేందుకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా దుకాణాదారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అడిషనల్‌ కలెక్టర్లు సీరియస్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. logo