శనివారం 08 ఆగస్టు 2020
Siddipet - Aug 01, 2020 , 23:57:02

సీఎం నాటిన మొక్క..పెరిగింది ఎంచక్కా...

సీఎం నాటిన మొక్క..పెరిగింది ఎంచక్కా...

గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లో సీఎం కేసీఆర్‌ నాటిన మొక్కలకు రెండేండ్లు నిండాయి. నాలుగో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ 2018 ఆగస్టు 1న గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని భారతమ్మ ఇంట్లో కొబ్బరిమొక్కను నాటారు. గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌ ఎదురుగా కదంబ మొక్కను నాటారు. ఆ మొక్క వెంట పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరికొన్ని కదంబ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

-గజ్వేల్‌ అర్బన్‌ 


logo