శుక్రవారం 29 మే 2020
Nizamabad - Jan 23, 2020 , 03:18:19

స్వల్ప ఉద్రిక్తత

స్వల్ప ఉద్రిక్తత


ఖలీల్ మున్సిపల్ ఎన్నికలు బుధవారం ముగిశాయి. ప్రజలు ప్రశాంతగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సమయంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు కమిషనర్ కార్తికేయ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో మొత్తం రెండు వేలకు పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్, ఆర్మూడ్ సిబ్బంది మొత్తం 1600 మందికి పైగా, హోంగార్డు సిబ్బంది 300, ఓడీ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది 110 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీ పరిధిల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.

పలు డివిజన్లలో స్వల్ప ఉద్రిక్తత

నగరంలోని  పలు డివిజన్లలో స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగింది. నగరంలోని 20వ డివిజన్ ఎల్లమ్మగుట్టలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ నాయకుల హల్

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న సమయంలో 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో బీజేపీ నాయకులు హల్ చేశారు. ఓటమి భయంతో పోలింగ్ కేంద్రానికి తాళం వేసేందుకు ప్రయత్నించారు. దీంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ సంఘటనా స్థలానికి చేరుకొని ఏసీపీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్త చేశారు. బీజేపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని దురుసుగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారి తీసింది.


logo