JEE Mains: మహారాష్ట్ర రైతు కుమారుడే.. జేఈఈ ఆలిండియా టాపర్
JEE Mains: రైతుకు పుట్టిన నీలకృష్ణ గజారే.. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా టాపర్ ర్యాంక్ సాధించాడు. రెండేళ్ల నుంచి అతను సడలని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ప్రిపేరయ్యాడు. నీలకృష్ణ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తాడు. రెండు గంటల పాటు చదువుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాయామం చేస్తాడు. మళ్లీ 8.30 నిమిషాలకు చదువు ప్రారంభిస్తాడు. రాత్రి 10 గంటలకు నిద్రపోతాడు.
వాసిమ్: మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లాకు చెందిన ఓ రైతుకు పుట్టిన నీలకృష్ణ గజారే.. జేఈఈ మెయిన్స్‌లో(JEE Mains) ఆల్ ఇండియా టాపర్ ర్యాంక్ సాధించాడు. సడలని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గత రెండేళ్ల నుంచి అతను పరీక్షలు ప్రిపేరయ్యాడు. వాసిమ్ జిల్లాలోని బేల్ఖేడ్ గ్రామానికి చెందిన అతను చాలా కఠినమైన షెడ్యూల్‌తో పరీక్షలకు సిద్ధమయ్యాడు. ప్రతి రోజూ పది గంటల పాటు చదువుకే అంకితమయ్యేవాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమారుడు సాధించిన విజయం పట్ల మాటలు రావడం లేదని నీలకృష్ణ తండ్రి నిర్మల్ గజారే తెలిపారు.
అకోలాలోని రాజేశ్వర్ కాన్వెంట్లో నీలకృష్ణ ప్రైమరీ స్కూలింగ్ చేశాడు. వాసిమ్‌లోని ఖరంజాలోని జేసీ హైస్కూల్లోనూ చదివాడు. తన కుమారుడు హార్డ్ వర్క్ చేస్తాడని, అతను ఆర్చరీలో రాష్ట్ర, జాతీయ జట్టుకు ఎంపికైనట్లు తండ్రి చెప్పాడు. ప్రస్తుతం అతను శ్రీ ధ్యానేశ్వర్ మాసుక్జీ బురుంగలే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాడు.
నీలకృష్ణ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తాడు. రెండు గంటల పాటు చదువుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాయామం చేస్తాడు. మళ్లీ 8.30 నిమిషాలకు చదువు ప్రారంభిస్తాడు. రాత్రి 10 గంటలకు నిద్రపోతాడు. ఐఐటీ బాంబేలో ఉన్నత విద్యను అభ్యసించాలని నీలకృష్ణ ఆశిస్తున్నట్లు తండ్రి తెలిపారు. షీగావ్లో ఉన్న నీలకృష్ణ ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ కోసం ప్రిపేరవుతున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

