గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:18:21

ఏడు వారాల నగల గురించి తెలియని నిజాలు

ఏడు వారాల నగల గురించి తెలియని నిజాలు

హైదరాబాద్: ఆభరణాలంటే ఇష్టపడని అతివలు ఉండరంటే అతిశయోక్తి కాదు. పండుగలు , శుభకార్యాల్లో మహిళలు ఆభరణాలతో అందంగా ముస్తాబు అవుతుంటారు.  

మగువలు నగలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారంటే రోజుకో రకమైన ఆభరణాలను ధరించేంతగా.... వీటినే ఏడువారాల నగలు అంటారు. మార్కెట్ ట్రెండ్ మారినా ఈ ఏడువారాల నగలకు ఆదరణ పెరుగుతూనేఉన్నది. ఏడువారాల నగలను గురించి పురాణాల్లోనూ ప్రస్తావించారట. అంతటి ప్రాధాన్యత ఉన్న ఏడు వారాల నగలను గురించిన విశేషాలు... 

 - వారాన్ని అనుసరించి ఆరోజు గ్రహాధిపతిని బట్టి ఏ ఏ నగలు ఎప్పుడెప్పుడు ధరించాలో మన పూర్వీకులు చెప్పారు. అందులో భాగంగా 

  "ఆదివారం" సూర్యు భగవానునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కెంపుతో తయారు చేసిన నగలు, హారాలు, కమ్మలను ధరించాలి.

-"సోమవారం" చంద్రునికి ఇష్టమైన రోజు. ఆ రోజున ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలంకరించుకుంటారు. 

-"మంగళవారం" కుజుడికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు పగడాలతో చేసిన నగలను ధరిస్తారు.

-"బుధవారం" బుధుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చల హారాలు, గాజులు వేసుకుంటారు.

-"గురువారం" నాడు బృహస్పతికి ఇష్టమైన రోజు. అందుకే గురువారం రోజు పుష్యరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు ధరిస్తారు.

-"శుక్రవారం" శుక్రుడికి ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వజ్రాల హారాలు, ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు.

-" శనివారం" శనిదేవునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలాల నగలను ధరిస్తారు. నీలంతో చేసిన కమ్మలు, ముక్కుపుడక పెట్టుకుంటారు. ఇలా.. ఒక్కోరోజు ఒక్కో రత్నంతో చేసిన నగలను వేసుకునేవారు అప్పటితరం ఆడవారు. అలాకాకుండా మొత్తం నవరత్నాలతో కమ్మలు, ముక్కుపుడక, హారం, పాపిడిబిళ్ల, వంకీలు.. ఇలా పలు రకాల డిజైన్ల లో నగలు చేయించుకునేవారు అప్పటి తరం అతివలు. నేటితరం లోనూ అదే ట్రెండ్ ఇమిటేషన్ జ్యువెలరీస్  రూపంలో కొనసాగుతున్నది. 


logo