Lok Sabha Elections | అమ్రోహలో ఓటు వేసిన మమ్మద్ షమీ.. Video
Lok Sabha Elections | భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 26) దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ పట్టణంలోగల ఓ పోలింగ్ బూత్లో షమీ ఓటు వేశారు.
Lok Sabha Elections : భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 26) దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ పట్టణంలోగల ఓ పోలింగ్ బూత్లో షమీ ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం షమీ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ ఓటువేసే హక్కుతోపాటు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నదనే విషయాన్ని తాను గుర్తు చేయదల్చుకున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగంలో నా పేరును ప్రస్తావించి ప్రశంసించడంతో చాలా గర్వంగా ఉందని అన్నారు.
కాగా లోక్సభ ఏడు విడతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరిగింది. జూన్ 1న ఏడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Indian Cricketer Mohammad Shami arrives at a polling booth in Amroha to cast his vote for the second phase of #LokSabhaElections pic.twitter.com/1WkNpyh8Ys
— ANI (@ANI) April 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

