Youth beats woman | ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళతో స్నేహం.. 45 ఏళ్లుగా తెలుసుకుని ఆమెను కొట్టిన యువకుడు
Youth beats woman | ఒక యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ మహిళను చూసి ఆమె వయస్సు 45 ఏళ్లుగా తెలుసుకున్న ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఆగ్రహంతో ఆమెను కొట్టాడు.
లక్నో: ఒక యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ మహిళను చూసి ఆమె వయస్సు 45 ఏళ్లుగా తెలుసుకున్న ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఆగ్రహంతో ఆమెను కొట్టాడు. (Youth beats woman) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల దీపేంద్ర సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మహిళ పరిచయమైంది. ప్రొఫైల్ ఫొటో యంగ్‌గా ఉండటంతో ఆమెతో చాట్ చేశాడు. ఆన్లైన్ స్నేహం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో ఒకసారి కలుసుకోవాలని భావించారు.
కాగా, దీపేంద్ర సింగ్, ఆ మహిళ స్వయంగా కలుసుకున్నారు. అయితే వయసులో పెద్దగా ఆమె ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. దీని గురించి ఆ మహిళను ఆరా తీయగా తన వయస్సు 45 ఏళ్లు అని చెప్పింది. దీంతో ఆగ్రహించిన దీపేంద్ర సింగ్ ఆ మహిళను కొట్టాడు. ఆమె తలను నేలకేసి బాదాడు. ఆ మహిళ మొబైల్ ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు గుర్తు తెలియని వ్యక్తి తనను కొట్టి మొబైల్ ఫోన్ చోరీ చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయగా ఆ మహిళ ఇన్స్టాగ్రామ్ స్నేహితుడు దీపేంద్ర సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- age
- beats
- befriends
- discovering
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

