Matheesha Pathirana | ధోనీ నాకు తండ్రితో సమానం.. మరో సీజన్ ఆడితే అదృష్టమే..!
Matheesha Pathirana : ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో మథీశ పథిరన(Matheesha Pathirana) ఒకడు. ఈ జూనియర్ మలింగ చెన్నై ఫ్రాంచైజీకి చెందిన 'లయన్స్ అప్‌క్లోజ్'(Lions Upclose) షోలో మాట్లాడుతూ.. తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Matheesha Pathirana : ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో మథీశ పథిరన(Matheesha Pathirana) ఒకడు. బౌలింగ్ సంచలనంగా పేరొందిన ఈ కుర్ర పేసర్ 17వ సీజన్లోనూ ఇరగదీస్తున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ జూనియర్ మలింగ చెన్నై ఫ్రాంచైజీకి చెందిన ‘లయన్స్ అప్‌క్లోజ్'(Lions Upclose) షోలో మాట్లాడుతూ.. తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్లో తనకు మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) తండ్రితో సమానమని పథిరన అన్నాడు. ‘మా నాన్న తర్వాత నన్ను క్రికెట్లో ప్రోత్సహించే బాధ్యత తీసుకున్న వ్యక్తి ధోనీ. ఆయన నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. నేను ఏం చేయాలో సలహాలు ఇస్తుంటారు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న కూడా ధోనీ లాగే పలు విషయాలు చెప్పేవాడు. మైదానంలో ఉన్నప్పుడు చిన్న సంగుతులే చెప్పినా.. అవి ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. దాంతో, నాలో ఆత్మవిశ్వాసం రెండింతలు అవుతుంది. అందుకనే క్రికెట్ గురూ ధోనీ నాకు తండ్రితో సమానం’ అని పథిరన వెల్లడించాడు.
“In my Cricket life, Dhoni is like my Father.”
🥹💛– Matheesha Pathirana 🎙️ pic.twitter.com/wvrLborwP2
— 🜲 (@balltamperrer) May 3, 2024
తొలి సీజన్లోనే 19 వికెట్లు..
అంతేకాదు ధోనీ మరొక సీజన్ ఆడాలని పథిరన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మహీ భాయ్ మీరు మరొక సీజన్ ఆడితే మాతో కలిసి ఆడాలి. నేను ఒకవేళ ఇక్కడే ఉంటే ఎంతో సంతోషిస్తా అని ఈ యార్కర్ కింగ్ తెలిపాడు. 16వ సీజన్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పథిరన తన మార్క్ చూపించాడు. 19 వికెట్లతో చెలరేగి చెన్నై జట్టు ఐదో టైటిల్ గెలవడంలో ఈ శ్రీలంక కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ ఫామ్‌ను 17వ సీజన్లోనూ చూపిస్తున్న పథిరన రెచ్చిపోతున్నాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 7.68 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు.

పిచ్చి అభిమానం
చెన్నై జట్టు సభ్యుల పట్ల పెద్దన్నలా మెలిగే ధోనీ అంటే పథిరన కుటుంబ సభ్యులకు పిచ్చి అభిమానం. దాంతో కొన్ని రోజుల క్రితం పథిరన కుటుంబాన్ని ధోనీ కలిశాడు. వాళ్లతో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
-
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు - Temperature | ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
-
Lakshmi Parvathi | తండ్రికే అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఎలా అండగా ఉంటాడు.. లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

