తమిళ అగ్ర హీరో కార్తి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్నది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు చెందిన ప్రకటనను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని మేళవించిన ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతున్నదని వారు తెలిపారు. దేవ్, సర్దార్, సర్దార్ 2 చిత్రాల తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ సంస్థలో కార్తి నటిస్తున్న నాలుగో చిత్రమిది. కార్తి, మోహన్‌రాజా కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో కార్తి పవర్ఫుల్ అవతారంలో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.