అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం
అగ్ర కథానాయకుడు రవితేజ ‘ఇరుముడి’ చిత్రం ఈ నెల 21న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచారంలో మేకర్స్ వేగం పెంచారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘యాలో యాలాలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చట్లో.. అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం..’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు.
అగ్ర కథానాయకుడు రవితేజ ‘ఇరుముడి’ చిత్రం ఈ నెల 21న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచారంలో మేకర్స్ వేగం పెంచారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘యాలో యాలాలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చట్లో.. అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం..’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. హెషమ్ అబ్దుల్ వహాబ్, సాధికా కేఆర్ కలిసి ఆలపించారు. మధ్య తరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని తెలియజేస్తూ ఈ పాట సాహిత్యం సాగింది. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ఆటోడ్రైవర్‌గా ఇందులో రవితేజ నటిస్తున్నట్టు ఈ పాట తెలియజెపుతున్నది. ప్రియ భవానీశంకర్, బేబీ నక్షత్ర తమ సహజమైన నటనతో పాత్రలకు అందాన్ని తెచ్చారు. ఈ గీతానికి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందించడం విశేషం. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

