Arvinder Lovely | కాంగ్రెస్‌కు షాక్.. మళ్లీ బీజేపీలో చేరిన అరవిందర్ లవ్లీ
Arvinder Lovely | కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు. అరవిందర్ లవ్లీతోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ కూడా బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ (Arvinder Lovely) మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ సమక్షంలో ఆయన మరోసారి బీజేపీ గూటికి చేరుకున్నారు. అరవిందర్ లవ్లీతోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ కూడా బీజేపీలో చేరారు.
కాగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా రెండోసారి వైదొలగిన అరవిందర్ లవ్లీ, బీజేపీలో చేరబోనని తెలిపారు. టికెట్ల పంపిణీపై మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వదంతులను ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని అరవిందర్ లవ్లీ తప్పుపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈ మేరకు లేఖ రాశారు.
మరోవైపు 2015లో కూడా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి అరవిందర్ లవ్లీ వైదొలగారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన తొమ్మిది నెలల తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

