AI : కృత్రిమ మేథ (ఏఐ) రాకతో కాల్ సెంటర్ పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని టీసీఎస్ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. ఏఐ కారణంగా సంప్రదాయ కాల్ సెంటర్ల అవసరం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. న్యూ టెక్నాలజీతో ఆసియా సహా పలు చోట్ల కస్టమర్ సర్వీస్ కార్యకలాపాల్లో మార్పులపై కృతివాసన్ ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. కస్టమర్ సర్వీస్ రంగంలో ఏఐ పెను మార్పులకు దారితీస్తుందని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో కాల్ సెంటర్స్ కనిపించవని అంచనా వేశారు. వీటిని కస్టమర్ ప్రశ్నలను ముందుగానే ఊహించి, పరిష్కరించగలిగే సామర్ధ్యం కలిగిన ఏఐ సిస్టమ్స్ ఆక్రమిస్తాయని పేర్కొన్నారు. కస్టమర్ సమస్యలను పసిగట్టి సంబంధిత కాల్‌ను ముందుగానే ఊహించి పరిష్కరించే టెక్నాలజీ దశను చూడబోతున్నామని చెప్పుకొచ్చారు. ఓ ఏడాదిలోనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
జనరేటివ్ ఏఐ తక్షణ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడే ఉద్వేగానికి లోను కారాదని అన్నారు. ఏఐ గురించి ఇప్పుడే అందరూ మాట్లాడుతున్నారని, కానీ దీని వాస్తవ ప్రభావానికి సమయం పడుతుందని, పాత ఉద్యోగాలను రీప్లేస్ చేయడమే కాకుండా లేటెసస్ట్ టెక్నాలజీతో నూతన అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఏఐ అభివృద్ధితో నైపుణ్యంతో కూడిన ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడుతుందని, లేటెస్ట్ టెక్నాలజీతో నూతన ఉపాధి అవకాశాలు ముందుకొస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
K Sudhakar: బీజేపీ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్.. రూ. 4.8 కోట్లు సీజ్