Palle Ravi Kumar Goud : మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud) అన్నారు. క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ అరాచకాలను ప్రశ్నించిన బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమేనని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ.. చైర్మన్ పదవి దూరం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా నడుపుతున్న కుతంత్రాన్ని అడ్డుకున్న మహిళా కౌన్సిలర్ల పట్ల అధికార కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి వికృత చేష్టలను ఎదురించిన బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టడం అన్యాయం. మహిళా కౌన్సిలర్లపై జరిగిన దౌర్జన్యంపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. బాల్క సుమన్ మీద అక్రమ కేసులు బనాయిస్తే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రభుత్వ దాష్టీకానికి వ్యతిరేకంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతాం’ అని పల్లె రవి కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.