IND vs NED | దూబే మెరుపులు.. అజేయంగా సూపర్ 8కు టీమిండియా..!
IND vs NED : హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లిన భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. 17 పరుగుల తేడాతో విజయం సాధించి.. అజేయంగా నాకౌట్ దశకు చేరుకుంది.
IND vs NED : హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లిన భారత్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. టాపార్డర్ రాణించకున్నా శివం దూబే(66) అర్ధ శతకంతో కదం తొక్కి భారీ స్కోర్ అందించగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(3-14) బంతితో నెదర్లాండ్స్ బ్యాటర్లను హడలెత్తించాడు. లీడే(33), అకెర్మన్(23)లు పోరాడినా.. 176కే కట్టడి చేసింది. 17 పరుగుల తేడాతో విజయం సాధించి.. అజేయంగా నాకౌట్ దశకు చేరుకుంది.
మూడోసారి పొట్టి ప్రపంచకప్‌పై గురి పెట్టిన భారత్.. లీగ్ దశను అజేయంగా ముగిచింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్ దశకు చేరుకున్న టీమిండియా.. చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. శివం దూబే(66) మెరుపులతో 193 రన్స్ కొట్టిన భారత జట్టు.. అనంతరం వరుణ్ చక్రవర్తి(3-14), దూబే(2-35)లు రాణించగా కట్టడి చేసింది.
🎯
Jasprit Bumrah in his element 🤷♂️
Updates ▶️ https://t.co/SdXngdnwKB#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNED️ pic.twitter.com/bRK8Wsfv3S
— BCCI (@BCCI) February 18, 2026
భారత్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వారి వ్యూహం ఫలించలేదు. వరుణ్ చక్రవర్తి తొలి బ్రేకిస్తూ మ్యాక్స్ డీ డౌడ్(20)ను ఔట్ చేశాడు. అనంతరం.. పాండ్యా ఓవర్లో మైఖేల్ లెవిట్(24)ను పెవిలియన్ చేర్చగా.. బాస్ డీ లీడే(33), కొలిన్ అకెర్మన్(23)లు ధాటిగా ఆడారు. కానీ. దూబే ఓవర్లో లీడే ఔట్ కాగా.. అకెర్మన్ను చక్రవర్తి డౌగట్ పంపాడు. దాంతో.. 94కే నాలుగు వికెట్లు కోల్పోయిన డచ్ జట్టు.. ఇన్నింగ్స్ 120లోపే ముగిస్తుందనిపించింది. కానీ.. ఆఖర్లో జాజ్ లయన్ (26), నోహ్ క్రొయెస్(25 నాటౌట్) బౌండరీలతో చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
𝗪 𝗪 𝗪 𝗪#TeamIndia end the league stage with a 4⃣th consecutive victory ✅
Bring on the Super 8s 💪
Scorecard ▶️ https://t.co/SdXngdnwKB#T20WorldCup | #MenInBlue | #INDvNED️ pic.twitter.com/pgi086F3ls
— BCCI (@BCCI) February 18, 2026
దూబే, పాండ్యా ధనాధన్
అహ్మదాబాద్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(0) డకౌటైనా.. శివం దూబే(66) శివాలూగిపోయాడు. టాపార్డర్ విఫలమైనా నేనున్నానుగా అంటూ అర్ధ శతకంతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు భారీ స్కోర్ అందించాడు. తిలక్ వర్మ,(31), సూర్యకుమార్ యాదవ్(34) మెరుపులను కొనసాగించిన దూబే.. నెదర్లాండ్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. హార్దిక్ పాండ్యా(30)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన దూబే.. ఈ టోర్నీలో రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. డెత్ ఓవర్లలో దూబే, పాండ్యా మరింత చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

