Gurrala Nagaraju | క్యాతనపల్లిలోని రాజకీయ పరిణామాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పు..!
హైదరాబాద్: క్యాతనపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల(Gurrala Nagaraju) ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: క్యాతనపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల (Gurrala Nagaraju) ఆందోళన వ్యక్తం చేశారు. దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
క్యాతనపల్లిలో ప్రజలు స్పష్టమైన మెజారిటీని భారత రాష్ట్ర సమితికి అందించినప్పటికీ, ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని గుర్రాల నాగరాజు ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను, ఆర్థిక ప్రభావాన్ని వినియోగించి ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేందుకు బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని నాగరాజు ఆరోపించారు. హంగ్ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రతిపక్ష ప్రతినిధులపై అనైతికంగా ఒత్తిడి తీసుకువచ్చి.. ప్రజా తీర్పును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?


