iBomma Ravi | జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల.. 90 రోజులకు ఊరట..!
iBomma Ravi : పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి (iBomma Ravi) ఎట్టకేలకు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 90 రోజులుగా జైల్లోనే గడిపిన రవి బుధవారం బయటకొచ్చాడు.
iBomma Ravi : పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి (iBomma Ravi) ఎట్టకేలకు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 90 రోజులుగా జైల్లోనే గడిపిన రవి బుధవారం బయటకొచ్చాడు. గతేడాది నవంబర్‌లో అరెస్టైన ఇమ్మడి రవికి మంగళవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో, జైలు అధికారులు అతడిని విడుదల చేశారు నుంచి బయటకొచ్చాడు.
సినిమాల పైరసీతో నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇమంది రవిని గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు పాల్పడినందున అతడిపై మొత్తంగా ఐదు కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు, బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో మరో కేసు పెట్టారు. అయితే.. రవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అయినా సరే పలుమార్లు బెయిల్‌కోసం ప్రయత్నించిన రవికి బిగ్ రిలీఫ్ ఇస్తూ.. ఫిబ్రవరి 17(మంగళవారం)న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
షరతులు ఇవే..
ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. విదేశాలకు పారిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు వెళ్ల పాస్ పోర్టును కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు ఇంటర్నెట్ ఉపయోగించవద్దని.. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని రవికి తెలియజేసింది.
పలువురు సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా రవిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఐదు కేసుల విషయంలో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేసి విచారించారు. పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? అతని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? అతను ఒక్కడే ఈ పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను నడిపాడా? లేదా గ్రూపుగా పనిచేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో రవి తన స్నేహితుల సర్టిఫికెట్లు దొంగిలించాడనే విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?


