డిసెంబర్ వడ్డీపోటు తప్పదు!
రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ సమీక్షలోనూ వడ్డీరేటును 0.25 శాతం పెంచవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అంచనా వేసింది.
ముంబై, నవంబర్ 14: రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ సమీక్షలోనూ వడ్డీరేటును 0.25 శాతం పెంచవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అంచనా వేసింది. గతంలో చెప్పిన 0.50 శాతం పెంపు అంచనాను సగానికి తగ్గించింది. బాహ్య పరిస్థితులు మెరుగుపడటం, విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ పెరగటం, రూపాయిపై ఒత్తిడి తగ్గడం వల్లే అంచనాను సవరించినట్లు వెల్లడించింది. రిజర్వుబ్యాంక్ నిర్దేశించిన 6 శాతం కంటే అధికంగా ద్రవ్యోల్బణం నమోదైనప్పటికీ ఈ అంచనాను సవరించడం విశేషం. ప్రస్తుత వడ్డీరేటు పెంపు డిసెంబర్లోది చివరిది అయ్యే అవకాశం ఉన్నదని తన నివేదికలోతెలిపింది.
దాదాపు నాలుగేండ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ అక్టోబర్‌లో కీలక పాలసీ రేటును 0.25 శాతం పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనపడిన రూపాయి, అధిక ముడిచమురు ధరల మధ్య మరిన్ని వడ్డీరేట్ల పెంపులు ఉండవచ్చని అప్పట్లో సంకేతాలిచ్చింది. నవంబర్‌లో ద్రవ్యోల్బణం 6 శాతానికి పైకి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత తగ్గుతుందని తన నివేదికలో వెల్లడించింది.
రూపాయిని కట్టడి చేయడంలో సెంట్రల్ బ్యాంక్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 94 కంటే దిగువకు రావడంతోపాటు నగదు లభ్యతపై ఒత్తిడి కూడా తగ్గిందని తెలిపింది. అక్టోబర్ చివరి వారంలో 5.8 శాతానికి చేరిన కాల్ మనీ రేటు, తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 5.44 శాతం కంటే దిగువకు తగ్గిందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

