Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వర్షిణికి బిగ్ షాక్.. ఇక కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు,తల్లి రాకతో ఎమోషనల్..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో డ్యాన్స్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం హౌస్‌లో జరిగిన పరిణామాలను ప్రేక్షకులకు చూపించడంతో పాటు, కంటెస్టెంట్స్ మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో డ్యాన్స్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం హౌస్‌లో జరిగిన పరిణామాలను ప్రేక్షకులకు చూపించడంతో పాటు, కంటెస్టెంట్స్ మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో నరేష్ విజయం సాధించి ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక వర్షిణికి మాత్రం నాగార్జున ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సీజన్లో మరోసారి కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా చేశారు. శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ముకేశ్, వర్షిణి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ గొడవ గురించి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. అనంతరం కెప్టెన్సీ రేసులో రెండో స్థాయికి చేరుకున్న నలుగురు కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చారు. నరేష్, అమన్, వంశీ, రామకృష్ణ కెప్టెన్సీ పోటీలో నిలిచారు.
‘కెప్టెన్’ అనే అక్షరాలు పూర్తయ్యేలా ఈ నలుగురిలో ఎవరికి మద్దతు ఇస్తున్నారో హౌస్ సభ్యులు ఒక్కో అక్షరాన్ని అందిస్తూ తమ కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. ఈ క్రమంలో ముకేశ్ నరేష్‌కు, శివ అమన్‌కు, రామ్ ప్రసాద్ నరేష్‌కు, వర్షిణి అమన్‌కు, నీతూ అమన్‌కు, దేబ్జానీ నరేష్‌కు, శ్వేతా అమన్‌కు, సుధీర్ నరేష్‌కు, త్రిగుణ్ నరేష్‌కు మద్దతు తెలిపారు. నరేష్‌కు అత్యధిక మద్దతు లభించడంతో మిగిలిన అక్షరాలను కూడా అతడికే కేటాయించాలని బిగ్‌బాస్ సూచించారు. దీంతో ఈ వారం కొత్త కెప్టెన్‌గా నరేష్ ఎంపికయ్యాడు. వంశీ తన కెప్టెన్ స్టిక్కర్‌ను నరేష్‌కు అందించి, అతడిని భుజాలపై ఎత్తుకొని అభినందించాడు. అనంతరం నరేష్‌కు కెప్టెన్ మెడల్ అందజేశారు. కొత్త కెప్టెన్‌గా లభించిన గోల్డ్ కాయిన్స్‌ను నరేష్ రామ్ ప్రసాద్, వంశీలకు ఇచ్చాడు.
కంటెస్టెంట్స్ మధ్య గత పది వారాలుగా జరిగిన గొడవలు, మనస్పర్థలను బయటపెట్టేందుకు నాగార్జున ‘ఐ యామ్ సారీ.. ఐ యామ్ నాట్ సారీ’ అనే టాస్క్ నిర్వహించారు. ఈ ప్రయాణంలో ఎవరైనా తమను బాధపెట్టినట్లయితే వారి పేరు చెప్పాలి. అవతలి వ్యక్తి తన తప్పును అంగీకరిస్తూ ‘ఐ యామ్ సారీ’ లేదా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ‘ఐ యామ్ నాట్ సారీ’ అని చెప్పాలి. మొదట వర్షిణి త్రిగుణ్ పేరు చెప్పింది. నామినేషన్ల సమయంలో త్రిగుణ్ మాట్లాడిన మాటల వల్ల తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది. దీంతో త్రిగుణ్ తన వివరణ ఇచ్చి వర్షిణికి క్షమాపణ చెప్పాడు.
శ్వేతా రామ్ ప్రసాద్ పేరును ప్రస్తావించింది. కెప్టెన్సీ టాస్క్‌లో తనను తొలగించినందుకు బాధపడ్డానని చెప్పింది. అయితే నాగార్జున ఆ ఘటనకు సంబంధించిన వీడియోను చూపించగా, అందులో శ్వేతా తప్పు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో రామ్ ప్రసాద్ ‘ఐ యామ్ నాట్ సారీ’ అని చెప్పాడు. ముకేశ్, వర్షిణి మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్ గొడవకు సంబంధించిన వీడియోను కూడా నాగార్జున చూపించారు. ఈ విషయంలో వర్షిణి వైపే న్యాయం ఉందని స్పష్టం చేశారు. ఇక నీతూ వంశీ పేరు చెప్పి, నామినేషన్ల సమయంలో అతడు మాట్లాడిన మాటల వల్ల బాధపడ్డానని తెలిపింది. వంశీ తనకు క్షమాపణ చెప్పాడు. నీతూ తనను తాను కొట్టుకున్న వీడియోను చూపించిన నాగార్జున, ఇకపై అలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ముకేశ్ మాత్రం తనను బాధపెట్టిన సంఘటనలు ఏమీ లేవని చెప్పాడు. అయితే శివ తన పేరు ప్రస్తావిస్తూ వ్యక్తిగత జీవితం, క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు బాధపడ్డానని తెలిపాడు. దీంతో ముకేశ్ క్షమాపణ చెప్పి తన వాదనను వినిపించాడు. నరేష్ గతంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో త్రిగుణ్ కారణంగా తనకు నష్టం జరిగిందని చెప్పాడు. దీనికి త్రిగుణ్ ‘ఐ యామ్ సారీ’ అన్నాడు. అమన్ కూడా త్రిగుణ్ పేరు ప్రస్తావిస్తూ, గతంలో అసభ్య పదజాలం ఉపయోగించి మధ్యలోనే ఆపేసిన ఘటన తనను బాధించిందని చెప్పాడు. అప్పట్లో అమన్ కూడా అలాంటి మాటలే మాట్లాడాడని గుర్తుచేసిన త్రిగుణ్, చివరకు క్షమాపణ చెప్పాడు.
సుధీర్ తన కాలి నొప్పిని ఫేక్ అని నామినేషన్లలో ముకేశ్ అన్నందుకు బాధపడ్డానని తెలిపాడు. అయితే ముకేశ్ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా ‘ఐ యామ్ నాట్ సారీ’ అన్నాడు. కానీ సుధీర్ కాలి నొప్పి నిజమేనని నాగార్జున స్పష్టం చేశారు. వంశీ నీతూ పేరు చెప్పగా, నామినేషన్ల సమయంలో తనతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడినందుకు బాధపడ్డానని తెలిపాడు. నీతూ క్షమాపణ చెప్పింది. ఇక రామ్ ప్రసాద్ వర్షిణి పేరు ప్రస్తావిస్తూ గతంలో జరిగిన నామినేషన్ ఘటనను మరోసారి గుర్తుచేశాడు. దీనిపై వర్షిణి సారీ చెప్పింది. అయితే గత రెండు వారాలుగా అదే నామినేషన్ కార్డును పట్టుకుని గేమ్ ఆడుతున్న రామ్ ప్రసాద్ దగ్గర నుంచి ఆ కార్డును తీసుకుని నాగార్జున చింపేశారు. అందరూ నిన్ను కన్నింగ్ అంటున్నా.. నువ్వు కన్నింగ్ కాదు, చాణక్యుడివి అంటూ రామ్ ప్రసాద్‌ను ప్రశంసించారు.
దేబ్జానీ రామ్ ప్రసాద్ పేరు చెప్పింది. అతడు అందరికీ సహాయం చేస్తున్నప్పటికీ కెప్టెన్సీ విషయంలో వంశీకి ఓటు వేయడం తనను బాధించిందని తెలిపింది. దీనికి రామ్ ప్రసాద్ క్షమాపణ చెప్పడంతో పాటు, దేబ్జానీకి ఓటు వేస్తే టై అయ్యే పరిస్థితి ఉండటంతోనే వంశీకి మద్దతిచ్చానని వివరించాడు. త్రిగుణ్ వర్షిణి పేరు చెప్పి, ముకేశ్‌తో కలిసి తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటం, తనకు మద్దతుగా నిలవకపోవడం బాధించిందని తెలిపాడు. వర్షిణి క్షమాపణ చెప్పింది. ఇక రామకృష్ణ తన పేరు ప్రస్తావించిన నరేష్ గురించి మాట్లాడుతూ, ఫ్యామిలీ గేమ్‌లో తనకు బదులుగా ముకేశ్ గెలిచాడని చెప్పిన మాటలు బాధించాయని తెలిపాడు. దీనికి నరేష్ సారీ చెప్పాడు.
ఫ్యామిలీ వీక్‌లో దాదాపు అందరి కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చినప్పటికీ వర్షిణి, రామకృష్ణ కుటుంబాలు మాత్రం రాలేదు. దీంతో నాగార్జున ఈ ఇద్దరికీ మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇద్దరిలో ఒక్కరి కుటుంబ సభ్యులకే హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ నిర్ణయాన్ని హౌస్ సభ్యులే ఓటింగ్ ద్వారా తీసుకోవాలని సూచించారు. వర్షిణి తల్లి, రామకృష్ణ తల్లి హౌస్ బయటకు వచ్చి తమ పిల్లలను కలవడానికి ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వర్షిణి, రామకృష్ణ ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఓటింగ్‌లో దేబ్జానీ, నీతూ, వంశీ, సుధీర్, త్రిగుణ్, నరేష్, ముకేశ్లు వర్షిణికి మద్దతుగా ఓట్లు వేశారు. అమన్, శ్వేతా, శివ, రామ్ ప్రసాద్‌లు రామకృష్ణకు మద్దతిచ్చారు. దీంతో వర్షిణికి ఏడు ఓట్లు, రామకృష్ణకు నాలుగు ఓట్లు వచ్చాయి.
ఫలితంగా వర్షిణి తల్లికి మాత్రమే హౌస్‌లోకి వచ్చే అవకాశం లభించింది. రామకృష్ణ తల్లితో మాత్రం బయట నుంచే వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. తన తల్లి హౌస్‌లోకి రాలేకపోవడంతో రామకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి తల్లి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరూ వీడియో ద్వారా మాట్లాడుకుంటూ తమ బాధను పంచుకున్నారు. ఆ తర్వాత వర్షిణి తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టారు. తల్లిని చూడగానే వర్షిణి ఆనందంతో హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇద్దరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. హౌస్ సభ్యులను కూడా వర్షిణి తల్లి ఆప్యాయంగా పలకరించారు.
ముకేశ్, త్రిగుణ్‌లతో కూడా ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ముకేశ్‌తో మాట్లాడుతూ చివరి వరకు తన కూతురి చేయి పట్టుకుని ఆటలో ముందుకు సాగాలని సూచించారు. ఈ సన్నివేశం హౌస్‌లో భావోద్వేగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఫ్యామిలీ వీక్‌లో మిగిలిన కుటుంబ సభ్యుల కోసం వేసినట్లుగానే చివర్లో అమ్మ పాటను ప్లే చేశారు. వర్షిణి, ఆమె తల్లితో పాటు హౌస్ సభ్యులంతా పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అనంతరం వర్షిణి తల్లి హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వర్షిణికి బిగ్ షాక్.. ఇక కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు,తల్లి రాకతో ఎమోషనల్..!
IND vs PAK | భారత కుర్రాళ్లే ఆసియా కింగ్స్.. ఒక్క వికెట్ తేడాతో ఆఖరి బంతికి పాకిస్థాన్‌పై గెలుపు
Deeksha Diwas | ఈ నెల 29న అట్టహాసంగా దీక్షాదివస్.. అలుగునూరులో భారీ బహిరంగసభ
Rahul Gandhi | అమ్మ పుస్తకం అమ్మేందుకే రాహుల్ రాక.. భారత్ సమ్మిట్‌లో సోనియా ఆత్మకథ ప్రచారానికే ప్రాధాన్యం
UG Cable Tenders | రహస్యంగా యూజీ కేబుల్ పనులు.. ఫోన్లు బయటే పెట్టి ఆఫీసర్లతో ఆ గదిలో భేటీలు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

