గ్లోబల్ సమ్మిట్ వేదికపై టెకీ నిరసన
హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్- 2026 వేదికపై అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో టెక్ మహీంద్ర మాజీ ఉద్యోగిని ఆర్ భావన తన ఉద్యోగం తొలగింపుపై నిరసన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రశ్నలు లేవనెత్తడంతో కొద్దిసేపు కలకలం రేగింది. తన 11 ఏండ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమెను చూసుకునేందుకు మూడు రోజుల సెలవు తీసుకున్నందుకే యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించిందని భావన ఆరోపించారు.
- రాహుల్ ప్రసంగిస్తుండగా ఉద్యోగం నుంచి తొలగింపుపై ఆవేదన
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్- 2026 వేదికపై అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో టెక్ మహీంద్ర మాజీ ఉద్యోగిని ఆర్ భావన తన ఉద్యోగం తొలగింపుపై నిరసన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రశ్నలు లేవనెత్తడంతో కొద్దిసేపు కలకలం రేగింది. తన 11 ఏండ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమెను చూసుకునేందుకు మూడు రోజుల సెలవు తీసుకున్నందుకే యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించిందని భావన ఆరోపించారు.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్‌గాంధీ ప్రసంగం సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావన జూలైలో హైదరాబాద్‌లోని రాయదుర్గం, దుండిగల్ టెక్ మహీంద్ర కార్యాలయాల ఎదుట కూడా నిరసన చేపట్టారు. ఉద్యోగ సమయంలో వేధింపులు ఎదురొన్నానని, కనీసం విరామం తీసుకోవడానికి కూడా అనుమతి కోరాల్సిన పరిస్థితి ఉండేదని ఆరోపించారు. తన ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, భావనను ఉద్యోగం నుంచి తొలగించామనే ఆరోపణను టెక్ మహీంద్ర యాజమాన్యం గతంలో ఖండించింది. ఆమె సంస్థలో క్రియాశీల ఉద్యోగిగానే కొనసాగుతున్నారని, ఉద్యోగ సంబంధిత అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆగస్టులో సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగింపు వివాదం మరోసారి గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

