చండీగఢ్ : పంజాబ్లో ఇటీవల ఓ పెండ్లిలో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. రూ.8.5 కోట్ల కరెన్సీని ఆమెపై వెదజల్లినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వీడియోలో చూపిన దాని ప్రకారం తరన్ తరన్లో జరిగిన వేడుకలో వధువు సంప్రదాయ పద్ధతిలో మండపం మధ్యలో నిల్చొని ఉండగా బంధువులు ఆమెపై నోట్ల వర్షం కురిపించారు.
నేలపై కరెన్సీ పరుచుకొని ఉండగా.. అతిథులు ఆనందంతో నృత్యం చేశారు. అయితే నోట్ల వర్షంలో రూ.8.5 కోట్ల నగదు వాడారన్న విషయం వాస్తవం కాదని వధువు తల్లి వెల్లడించారు. కేవలం రూ.2 లక్షలు మాత్రమే తాము వాడామన్నారు. వేడుక నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, డీజే ప్రకారం నోట్ల వర్షం వాడిన నగదు రూ.4 లక్షల వరకు ఉండొచ్చు.