తెల్లవారకముందే..
మూడు పదుల్లోకి అడుగుపెట్టక ముందే జుట్టు తెల్లగా మారిపోతున్నది. ఈ సమస్యను తప్పించుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఓ పరిష్కారం ఉంది. జుట్టు తెల్లబడటం మొదలవ్వగానే.. మూల కారణం కనిపెట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. నలుపు రంగు ఇంకొంత కాలం నిలుస్తుంది.
మూడు పదుల్లోకి అడుగుపెట్టక ముందే జుట్టు తెల్లగా మారిపోతున్నది. ఈ సమస్యను తప్పించుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఓ పరిష్కారం ఉంది. జుట్టు తెల్లబడటం మొదలవ్వగానే.. మూల కారణం కనిపెట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. నలుపు రంగు ఇంకొంత కాలం నిలుస్తుంది. అతి కొద్దిమందిలోనే జన్యు సమస్య వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్నది. ఎక్కువమందిలో ఫోలేట్, కొబాలమిన్ విటమిన్లు లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తుతున్నది. ఈ రెండు విటమిన్లు డీఎన్ఏ నిర్మాణం, కొత్త కణాల తయారీతోపాటు జుట్టుకి నలుపు రంగునిచ్చే మెలనిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకే, ఒకటీ, రెండు వెంట్రుకలు తెల్లబడితే వెంటనే రంగు వేసుకోకుండా.. రక్త పరీక్ష చేయించుకోవాలి. ఫోలేట్, కొబాలమిన్ లోపమని తేలితే వెంటనే ఆహారంతో ఆ లోటుని భర్తీ చేసుకోవాలి. పాలకూర, ఆకుకూరలు, ఆకుపచ్చని పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, నిమ్మ, నారింజ, బత్తాయి రసం, పప్పులు, పల్లీలు, చిక్కుడు గింజలు, తృణ ధాన్యాల్లో ఫోలేట్ (విటమిన్ బి9) ఎక్కువగా ఉంటుంది. మాంసం, గుడ్డు, పాలు, పాల ఉత్పత్తులు, మజ్జిగ తీసుకుంటే.. శరీరానికి కొబాలమిన్ (విటమిన్ బి12) అందుతుంది. విటమిన్లు లోపిస్తే ఆరోగ్యమే కాదు.. అందమూ క్షీణిస్తుంది. కాబట్టి, తెల్ల జుట్టు రాగానే నూనెలు, రంగుల కంటే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

