ఆహారంలో మార్పు మంచిదే!
వానకాలంలో రోడ్లు, మార్కెట్ పరిసరాల్లో బురద నీరు ఎక్కువగా నిలుస్తుంది. అందులో దోమలు, ఈగలతోపాటు సూక్ష్మక్రిములు కూడా వృద్ధి చెందుతాయి. ఇవి పండ్లు, కూరగాయలపై వాలి.. బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి.
కాలంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, నిన్న ‘మంచి’ చేసిన పదార్థాలే.. నేడు ‘హాని’కరం కావొచ్చని అంటున్నారు. వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు, పండ్లు, పచ్చి కూరగాయలు.. వర్షాకాలంలో అనారోగ్యాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే, వర్షాలు కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను పక్కన పెట్టేయాలని సలహా ఇస్తున్నారు.
వానకాలంలో రోడ్లు, మార్కెట్ పరిసరాల్లో బురద నీరు ఎక్కువగా నిలుస్తుంది. అందులో దోమలు, ఈగలతోపాటు సూక్ష్మక్రిములు కూడా వృద్ధి చెందుతాయి. ఇవి పండ్లు, కూరగాయలపై వాలి.. బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి. ఇక వ్యాపారులు పండ్లు, కూరగాయలను సరిగ్గా కడగకపోయినా.. వాటిపై హానికరమైన సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతాయి. అలాంటి వాటిని సరిగ్గా కడగకుండా, వండకుండా తింటే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి లాంటి సమస్యల్ని సృష్టిస్తాయి. అంతేకాకుండా.. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు చాలావేగంగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలపై ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి, వాటిని పచ్చిగా, సరిగ్గా ఉడికించకుండా తింటే.. ఈ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. లేనిపోని ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి, వానకాలంలో ఆహారం విషయంలో ఈ కింది చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- క్యాలీఫ్లవర్, బ్రకోలీ, క్యాబేజీ లాంటి వాటిలో పురుగులు, సూక్ష్మక్రిములు ఎక్కువగా ఆశ్రయం పొంది.. వాటిలోనే గుడ్లు పెడుతాయి. వీటిని సరిగ్గా ఉడకబెట్టకుండా తింటే.. కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయి.
- టమాటా, దోసకాయ, క్యారెట్, బీట్రూట్ లాంటి వాటిని ఈ కాలంలో పచ్చిగా
తినడం మానేయాలి. - ఆపిల్, జామ లాంటి పండ్లను తొక్కను పూర్తిగా తీసేసి తినాలి.
- దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కోసి ఉంచిన పండ్లను కొనుగోలు చేయొద్దు.
- ఆరెంజ్, దానిమ్మ, అరటిపండ్లు, బత్తాయి లాంటి పండ్లపై తొక్క ఉంటుంది. కాబట్టి, బయటి సూక్ష్మక్రిములు వీటి లోపలికి ప్రవేశించలేవు. అందుకే, ఈ కాలంలో ఇలాంటి పండ్లను తినడం మంచిది.
- వానకాలంలో ఆకుకూరలు, కూరగాయలను సలాడ్ రూపంలో పచ్చిగా తినడం మానేయాలి. లేకుంటే.. వాటిని ఆవిరిపై బాగా
ఉడికించి మాత్రమే తినాలి. - మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటిలో నాలుగైదు నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి వండుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

