హైదరాబాద్ : ఎన్నికలో కోడ్(Election Code) నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో నగదును సీజ్(Cash seized) చేస్తున్నారు. తాజాగా కూకట్పల్లిలో( Kukatpally) వాహనాల తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు. ఏటీఎంలో నగదు నింపే వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.25.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యూర్ కోడ్, అనుమతులు లేకుండా నగదు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రైటర్ ప్రీవియస్ క్యాష్ లాజిస్టిక్స్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.