YS Jagan | భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం : వైఎస్ జగన్
YS Jagan | పులివెందుల వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో బుధవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.
అమరావతి : పులివెందుల ( Pulivendula ) వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో బుధవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ( YS Jagan) పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు.
నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

