గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:09:10

బీహార్‌లో పొంగిపొర్లుతున్న నదులు

బీహార్‌లో పొంగిపొర్లుతున్న నదులు

బీహార్ :  బీహార్ రాష్ట్రంలోని నదులు నీటి మట్టం పెరిగి పొంగిపొర్లుతున్నాయి. దీంతో బీహార్‌లోని 12 జిల్లాల్లో 29 లక్షల మంది ఈ వరదల బారిన పడ్డారు. సమస్తిపూర్‌లో బుద్ధి గండక్ నది ప్రమాదస్థాయికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఖగారియాలో కోసి,  సీతామార్హిలోని బాగ్మతి, దర్భంగ నదులు ప్రమాద స్థాయికంటే కంటే 2 మీటర్లు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. కహల్‌గావ్‌లోని గంగానది ఉప్పొంగుతోంది. గత కొద్దిరోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో బీహార్‌లోని నదుల్లో నీటి మట్టం పెరిగింది.

శరణ్ జిల్లాలోని తారయ్య, పనాపూర్ ప్రాంతాల్లో నదులు పొంగి వరద నీరు ఇండ్లలోకి చేరుతోంది. పలు చోట్ల రోడ్లపై మూడు అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. గోపాల్‌గంజ్‌లోని సరన్ ఆనకట్ట తెగడంతో గండక్ నది నీటి ప్రవాహం వేగం పెరిగింది. మంగళవారం ఉదయం నాటికి ఈ నీరు 32 గ్రామాలను కప్పేసింది. దీంతో ఆ గ్రామాల్లోని ఇళ్లు మునిగిపోవడంతో ప్రజలు ప్రాణాలను కావాడుకునేందుకు ఇంటి పైకప్పుల మీదకు ఎక్కారు.

 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo