సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 23, 2020 , 02:04:15

గోదావరి నీటి విడుదల

గోదావరి నీటి విడుదల


చిలుపూర్, జనవరి 22 : గోదావరి నీటి  చెక్ నింపేందుకు రాజవరం రిజర్వాయర్ తరలించే పైప్ అమర్చిన గేట్ ద్వారా మంగళవారం ఇం జినీరింగ్ అధికారులు నీటిని  విడుదల చేశా రు.  రాజవరం రిజర్వాయర్ పక్కనే ఉన్నప్పటికీ చిన్నపెండ్యాల, తాటికాయల గ్రామాల రైతులు సాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను తీర్చేందుకు ఐదేళ్ళుగా రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. రెండు గ్రామాల రైతుల కష్టాలను గుర్తించిన మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య స్పందించి ఆకేరువాగుపై తాత్కాలిక చెక్ నిర్మాణానికి రూ.9.95లక్షల నిధులను కలెక్టర్ గ్రాంట్ నుంచి మంజూరీ చేయించారు. ఈ నిధులతో చెక్ నిర్మాణాన్ని నెలరోజుల వ్యవధిలోనే పూర్తిచేశారు. చెక్ చిన్నపెండ్యాల-తాటికాయల గ్రామాల శివారులో నిర్మించడం వల్ల రెండు గ్రామాల పరిధిలోని వ్యవసాయ బావుల్లో నీటి ఊటలు పెరిగే అవకాశముంది.

చెక్ డ్యామ్ మంజూరీకి గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ తాళ్లపెల్లి సమ్మయ్య, తాళ్లపల్లి వెంకటయ్య, జగన్నాథం నిరంతరం కృషి చేయడం వల్ల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిర్మించిన చెక్ పూర్తి స్థాయి లో ఫలితాన్ని అందించినట్లయితే శాశ్వతం గా చెక్ డ్యామ్ మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.


logo