ఆదివారం 24 జనవరి 2021
International - Dec 03, 2020 , 15:37:37

ఈ స్కూల్‌లో పిల్లలకోసం కుక్కను పెంచుతున్నారు..వీడియో..!

ఈ స్కూల్‌లో పిల్లలకోసం కుక్కను పెంచుతున్నారు..వీడియో..!

మాడ్రిడ్‌: ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు బోధన ప్రత్యేకంగా ఉండాలి.. అందుకోసమే వారికి ప్రత్యేక విద్య అవసరం.. కరోనాతో పాఠశాలలు మూతబడ్డాయి. ఆరు నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అయితే, ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు నేరుగా పాఠాలు బోధిస్తే ఫలితం ఉండదని భావించిన ఓ స్కూల్‌ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. వారిని తరగతిగదికి అలవాటు చేసేందుకు ఓ గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతి కుక్కను వాడుకున్నారు. 

స్పెయిన్‌లో ప్రత్యేక విద్య అవసరాల కోసం ఒక పాఠశాల థెరపీ డాగ్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. సోల్ అనే గోల్డెన్ రిట్రీవర్ డాగ్‌ తరగతి గదిలో సందడి చేయడంతో ప్రత్యేక అవసరాలుగల పిల్లలు దానిచుట్టూ చేరి ఆనందంగా గడుపుతున్నారు. దాన్ని జుట్టును నిమురుతూ.. దాని తోకతో ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. అలా వారిని తరగతికి అలవాటుచేయడం తమ లక్ష్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo